![]() |
![]() |

శ్రీముఖి వేసుకున్న డ్రెస్ ని ఉద్దేశించి హీరోయిన్ మాధవీ లతా చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు బుల్లితెర మొత్తం కూడా శ్రీముఖి హవానే నడుస్తోంది. అలాగే ఆమె వేసుకునే డ్రెస్సులు కూడా బాగా హైలైట్ అవుతూ ఉంటాయి. ఇటీవలి కాలంలో యాంకర్ శ్రీముఖి చేతినిండా ఆఫర్స్ తో మస్త్ ఎంజాయ్ చేస్తోంది. మూవీస్ లో నటించడమే కాదు..మూవీ ఫంక్షన్స్, ఈవెంట్స్ అన్నిట్లో కనిపిస్తోంది. అలాగే జాతిరత్నాలు, ఆదివారం విత్ స్టార్ మా పరివారం, సారంగదారియా, మిస్టర్ అండ్ మిసెస్, వంటి షోస్ కి హోస్ట్ గా చేస్తూ బిజీ యాంకర్ ఐపోయింది.
రీసెంట్ స్టార్ట్ ఐన కొత్త షో "బీబీ జోడి" నెక్స్ట్ వీక్ ప్రసారం కాబోయే ఎపిసోడ్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ చేశారు. అందులో బుల్లి నిక్కరుతో కనిపించింది శ్రీముఖి. ఇక ఈమె వేసుకున్న ఈ డ్రెస్ మీద చాలా నెగటివ్ టాక్ వినిపిస్తోంది. సెలెబ్రిటీస్ కూడా ఈ డ్రెస్ మీద తమ స్పందనను చెప్తున్నారు. ఇక ఇప్పుడు శ్రీముఖి వేసుకున్న ఈ డ్రెస్ మీద మాధవిలత తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఒక స్టోరీ పోస్ట్ చేసుకుంది. 'శ్రీ.. నువ్వు మోడ్రన్, అల్ట్రా మోడ్రన్ డ్రెస్‌లు వేసుకో. కానీ అవి నీ శరీరానికి సెట్ అయ్యేలా చూసుకో. కళ్లకు నచ్చితే కాదు.. బాడీకి నప్పాలి. అప్పుడే చూడ్డానికి బాగుంటుంది' అంటూ చెప్పుకొచ్చింది.
మరి శ్రీముఖి రియాక్షన్ ఏమిటి..తన డ్రెస్సింగ్ స్టైల్ మార్చుకుంటుందా..లేదా చూడాలి. ఏదేమైనా సోషల్ మీడియాలో ఇప్పుడు మాధవీలత కామెంట్ మాత్రం ఫుల్ వైరల్ అవుతోంది.
![]() |
![]() |